Varun Chakaravarthy: వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి స్టువర్ట్ బిన్నీ రికార్డు బద్దలు
టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా (Indian Cricketer) చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు
Dubai, March 02: టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) అరుదైన ఘనత సాధించాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా (Indian Cricketer) చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. కాగా.. వరుణ్ చక్రవర్తికి (Varun Chakaravarthy) ఇది రెండో వన్డే మ్యాచ్ మాత్రమే. ఇంతకముందు ఈ ఘనత టీమ్ఇండియా మాజీ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. బిన్నీ తన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
Varun Chakaravarthy Scalps First Five-Wicket Haul in ODIs
కివీస్ తో మ్యాచ్ ప్రదర్శనతో వరుణ్ మరో ఘనతను సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా.. కివీస్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శన
రవీంద్ర జడేజా – 5/36 – 2013లో వెస్టిండీస్ పై
వరుణ్ చక్రవర్తి – 5/42 – 2025లో న్యూజిలాండ్ పై
మహ్మద్ షమీ – 5/53 – 2025లో బంగ్లాదేశ్ పై
సచిన్ టెండూల్కర్ – 4/38 – 1998లో ఆస్ట్రేలియాపై
జహీర్ ఖాన్ – 4/45 – 2002లో జింబాబ్వే పై
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కువగా వన్డేలు ఆడలేదని, ఛాంపియన్స్ ట్రోఫీలో తనకి ఇదే తొలి మ్యాచ్ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతిని వేసేటప్పుడు చాలా టెన్షన్ పడినట్లు తెలిపాడు. అయితే.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లు తనకు మద్దతు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ పై విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. మార్చి4న జరగనున్న సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.